స్టాక్ మార్కెట్లకు సెలవు

14 Apr, 2017 09:43 IST|Sakshi
ముంబై : స్టాక్ మార్కెట్లు నేడు సెలవును పాటిస్తున్నాయి. గుడ్ ప్రైడే, అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు ట్రేడింగ్ ను జరుపడం లేదు. కాగ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించిన క్యూ4 ఫలితాలు  అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో నిన్న మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పతనమైంది.  మొత్తం మీద సెన్సెక్స్‌ 182 పాయింట్లు నష్టపోయి 29,461 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9,151 పాయింట్ల వద్ద సెటిలయ్యాయి.
 
శుక్రవారం సెలవుతో పాటు, శని, ఆదివారాలు కూడా మార్కెట్లు ట్రేడింగ్ ఉండకపోవడంతో దేశీయ ఈక్విటీ సూచీలకు మూడు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. మరోవైపు దేశీయ మార్కెట్లతో పాటు అమెరికా ఫైనాన్సియల్ మార్కెట్లు గుడ్ ప్రైడే సందర్భంగా నేడు సెలవును పాటించనున్నాయి. మేజర్ ఆసియన్ మార్కెట్లు కూడా గుడ్ ప్రైడే, ఈస్టర్ మండే కారణంగా ఈ రోజుల్లో ట్రేడ్ హాలిడేను ప్రకటించాయి. అమెరికా కమోడిటీస్ మార్కెట్లు అంటే గోల్డ్, క్రూడ్-ఆయిల్ ఫ్యూచర్స్ నేడు ట్రేడింగ్ జరుపవు. 
మరిన్ని వార్తలు