ఐడీబీఐ బ్యాంక్‌తో లావాదేవీలపై భయం వద్దు!

19 Dec, 2019 03:49 IST|Sakshi

అది ప్రభుత్వానిదే;

పూర్తి సామర్థ్యం ఉంది

ఆర్థికశాఖ భరోసా  

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు డిపాజిట్లను ఉపసంహరిస్తుండటం... కొత్త డిపాజిట్లు చేయకపోవటం వంటి వ్యవహారాలపై ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుతో లావాదేవీల నిర్వహణ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఒక లేఖ రాసింది. ఎప్పటిలాగే బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ఐడీబీఐ బ్యాంక్‌కు తగిన సామర్థ్యం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రమోటర్‌ ఎల్‌ఐసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎల్‌ఐసీ, ప్రభుత్వం రెండింటికీ కలిపి బ్యాంకులో 97.46 శాతం వాటా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ ఈ ఏడాది జనవరిలో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దీనితో బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాం కుగా ఆర్‌బీఐ పునర్‌ వ్యవస్థీకరించింది. బ్యాంకు లో ప్రభుత్వ వాటా ప్రస్తుతం 46.46 శాతం. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు