ఆ ఖాతాల వివరాలు ఇవ్వలేం..చాలా గోప్యం

23 Dec, 2019 19:07 IST|Sakshi

స్విస్‌ బ్యాంకులో భారతీయుల ఖాతాల వివరాలు ఇవ్వలేం

పీటీఐ జర్నలిస్టు ఆర్టీఐ ప్రశ్నకు  ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు  వెల్లడి చేయలేనమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు  సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ఇలా స్పష్టం చేసింది. భారత్‌,  స్విట్జర్లాండ్‌ మధ్య ఉ‍న్న ఒప్పందాల మేరకు ఈ వివరాలను అందించలేమని తెలిపింది. అలాగే ఇతర విదేశీ దేశాలనుంచి వచ్చిన నల్లధనం వివరాలను వెల్లడించడానికి కూడా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. గోప్యతా నిబంధనలపై స్విట్జర్లాండుతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ వివరాలు ఇవ్వలేమని చెప్పింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సంబంధిత సమాచారం గోప్యంగా ఉంచాల్సి ఉందని తెలిపింది. పన్ను సంబంధిత సమాచారం, విదేశీ ప్రభుత్వాల నుండి కోరిన / పొందిన సమాచారాన్ని బహిర్గతం చేయలేమంది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన నుంచి వచ్చిన సమాచార వివరాలను అందించాలని పీటీఐకి  జర్నలిస్టు మంత్రిత్వ శాఖను కోరారు.  ఈ వివరాలతో సహా నల్లధనంపై విదేశాల నుండి వచ్చిన సమాచారం వివరాలను అందించాలని కూడా ఆర్టీఐ ద్వారా కోరారు.  దీనికి ప్రతిస్పందనగా ఈ విషయాన్ని ఆర్థిక శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు