ఫైనాన్షియల్ బేసిక్స్..

1 Aug, 2016 00:45 IST|Sakshi
ఫైనాన్షియల్ బేసిక్స్..

ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏ మార్గం ఉత్తమం?
మార్కెట్‌లో ప్రస్తుతం పలు రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో మనకు అనువైన ఫండ్‌ను ఎంచుకోవాలి. ఫండ్ ఎంపిక తర్వాత ఇందులో ఏ మార్గంలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి. ఇక్కడ మనం రెండు విధానాల్లో ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి డెరైక్ట్‌గా. మరొకటి రెగ్యులర్‌గా. మనం ముందుగా అసలు డెరైక్ట్ ప్లాన్ అంటే ఏమిటి? రెగ్యులర్ ప్లాన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా ఏఎంసీ (ఫండ్స్‌ను నిర్వహించే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ)తో లావాదేవీలను నిర్వహిస్తారు. అదే రెగ్యులర్ ప్లాన్‌లో అయితే ఇన్వెస్టర్..

డిస్ట్రిబ్యూటర్ అనే మధ్యవర్తి ద్వారా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే ఏఎంసీ మన ఇన్వెస్ట్‌మెంట్ నుంచి కొంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్‌కు కమీషన్ రూపంలో చెల్లిస్తుంది. దీంతో దాని ఎఫెక్ట్ మన రాబడిపై పడుతుంది. డెరైక్ట్ ప్లాన్‌లో ఇలాంటి సమస్యలుండవు. మన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్‌లోకి వెళతుంది. కేవలం రాబడిని ఆధారంగా చేసుకొని చూస్తే.. రెగ్యులర్ ప్లాన్ కన్నా డెరైక్ట్ ప్లాన్ చాలా ఉత్తమం. ఎవరైతే సొంతంగా ఇన్వెస్ట్‌మెంట్లను నిర్వహించుకోగలుగుతారో వారికి డెరైక్ట్ ప్లాన్ సరిపోతుంది. ఫండ్ ఎంపిక సహా ఇతర సర్వీసులకు డిస్ట్రిబ్యూటర్‌పై ఆధారపడే వారు రెగ్యులర్  ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

>
మరిన్ని వార్తలు