-

ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

27 Dec, 2019 19:54 IST|Sakshi

వృద్ధి మందగించినా ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంది

సాక్షి, ముంబై:  దేశీయ ఆర్థిక వ్యవస్థపై మందగమనం ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది.  వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని శుక్రవారం వెల్లడించింది. ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ అలాగే ఉందని  ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ తాజా నివేదికలో తెలిపింది.

ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 4.5 శాతంతో జీడీపీ ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డిసెంబరు ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ తన వృద్ధి అంచనాను 240 బేసిస్ పాయింట్లు తగ్గించి 5 శాతంగా పేర్కొంది. గ్లోబల్ రిస్క్‌లు, స్థూల ఆర్థిక పరిస్థితులపై రిస్క్ పర్సెప్షన్స్, ఫైనాన్షియల్ మార్కెట్ రిస్క్‌లు లాంటి ప్రధాన రిస్క్ గ్రూపుల ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై సాధారణ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఏదేమైనా, దేశీయ వృద్ధి, ఆర్థిక, కార్పొరేట్ రంగం, బ్యాంకుల ఆస్తి నాణ్యత వంటి వివిధ రంగాల్లోని నష్టాల అవగాహన 2019 ఏప్రిల్ -అక్టోబర్ మధ్య పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది.

మరిన్ని వార్తలు