జీవీకే బయోసెన్సైస్ ఎఫ్‌డీఐకు ఓకే

28 Nov, 2015 00:37 IST|Sakshi
జీవీకే బయోసెన్సైస్ ఎఫ్‌డీఐకు ఓకే

న్యూఢిల్లీ: జీవీకే బయోసెన్సైస్‌కు చెందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం లభించింది. మొత్తం రూ.160 కోట్ల విలువైన మూడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ)  ఆమోదం తెలిపింది.  అజెండాలో మొత్తం 24 ప్రతిపాదనలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు.

అయితే ఈ నెల మొదట్లో వెల్లడించిన కొత్త ఎఫ్‌డీఐ విధానం  కారణంగా 11 ప్రతిపాదనలు ఆటోమేటిక్ రూట్ కిందకు వస్తాయని,   ఈ 11 ప్రతిపాదనల విలువ రూ.300 కోట్లుగా ఉంటుందని  వివరించారు. జీవీకే బయోసెన్సైస్‌తో పాటు స్కేలేన్‌వర్క్స్ పీపుల్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ, జీఎంఎస్ ఫార్మా ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు.

ఏసీఎన్ కేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనను తిరస్కరించామని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ విదేశీ వాటా పెంపు ప్రతిపాదన,  ఫైర్‌ఫ్లై నెట్‌వర్క్స్, టాటా సికోర్‌స్కీ ఏరోస్పేస్ ప్రతిపాదనలతో సహా మొత్తం 9 ప్రతిపాదనలను ఎఫ్‌ఐపీబీ వాయిదా వేసిందని వివరించారు.

మరిన్ని వార్తలు