అలరిస్తున్న 360-డిగ్రీ స్మార్ట్ ఫోన్ వీఆర్ కెమెరా

2 Jun, 2016 17:43 IST|Sakshi
అలరిస్తున్న 360-డిగ్రీ స్మార్ట్ ఫోన్ వీఆర్ కెమెరా

360 డిగ్రీల్లో వీడియోను షూట్ చేయడానికి ఇప్పటినుంచి ఖరీదైన పరికరాలే మీకు అవసరం లేదు. ప్రపంచంలోనే మొదటి 360 డిగ్రీ స్మార్ట్ ఫోన్ వర్చువల్ రియాల్టీ (వీఆర్) కెమెరా వచ్చేసింది. తైపీ ట్రేడ్ షో 'కంప్యూటెక్స్ 2016'లో ఈ కెమెరాను మంగళవారం ప్రవేశపెట్టారు. తైవనీస్ కంప్యూటర్ హార్డ్ వేర్ కంపెనీ క్వాంటా కంప్యూటర్, కెనడియన్ వీడియో ప్రొడక్షన్ సర్వీసు ఎమర్ విజన్ లు ఈ 360 డిగ్రీ లైవ్ వీఆర్ స్ట్రీమింగ్ కెమెరాను ఈ షోలో ఆవిష్కరించారు. అరచేతిలో సరిపోయే ఈ కెమెరా తైపీ షోలో చూపరులకు కనువిందుగా నిలుస్తోంది. ఎలాంటి స్మార్ట్ ఫోన్ కు అయినా మాగ్నటికల్ గా దీన్ని అటాచ్ చేసుకుని వీడియోను చిత్రికరించుకోవచ్చట.

360X187 డిగ్రీ లెన్స్ తో ఈ కెమెరా వచ్చింది. సోనీ ఎక్స్ మోర్-హెచ్ డీఆర్ ఇమేజింగ్ సెన్సార్ ను ఉపయోగిస్తూ 16ఎంపీ పానోరామిక్ ఇమేజ్ లను ప్రొడ్యూస్ చేసుకోవచ్చని ఫోర్బ్స్ నివేదించింది. మైక్రోఫోన్ ను, యూఎస్ బీ పోర్ట్ ను ఈ డివైజ్ కలిగి ఉంటుంది. స్వతహాగా ఈ కెమెరాను వాడుకోవడమే కాకుండా, దుస్తులకు, వాహనాలకు, డ్రోన్లకు కూడా అటాచ్ చేసుకుని ఈ కెమెరాను వాడుకోవచ్చట.

మరిన్ని వార్తలు