తొలిసారి జియో గుట్టు విప్పిన అంబానీ

16 Oct, 2017 20:44 IST|Sakshi


 సాక్షి, ముంబై: టెలికాం రంగంలో   సునామీలా  దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో  ఫలితాల్లో మాత్రం నిరాశ పర్చింది.  అతి తక్కువ కాలంలో కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న జియో.. ఇటీవల  ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మాత్రం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు నష్టాలను మిగిల్చిన సంగతి విదితమే.  జియోకు సంబంధించిన  ఆదాయ వివరాలను ముఖ్యంగా  రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తొలిసారిగా  వెల్లడించడం విశేషం.    జియో  రూ. 271 కోట్ల రూపాయల నష్టాన్ని, రూ. 6,150 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని వెల్లడించారు. నష్టాలను నమోదు చేసినప్పటికీ వడ్డీలు, పన్నులు చెల్లించకముందు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ రూ.260 కోట్ల లాభాలను ఆర్జించినట్లు  వెల్లడించారు.
  
ఇటీవల వెల్లడించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జులై-సెప్టెంబర్‌ త్రైమాసిక  ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను మించి రిలయన్స్‌ 12.17 శాతం ఏకీకృత నికర లాభం సాధించింది. అయితే, జియోకు మాత్రం రూ.271కోట్ల నష్టం వచ్చినట్లు  రిపోర్ట్‌ చేసింది.  కానీ జియోకు రూ.2వేల కోట్ల దాకా నష్టాలు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ  నేపథ్యంలో కేవలం రూ.271 కోట్లకే నష్టాలు పరిమితం  కావడం తమకు  సానుకూలమైన అంశమేనని కంపెనీ భావిస్తోంది. 

మరిన్ని వార్తలు