మూడీస్‌ అలా..ఫిచ్‌ ఇలా..

5 Dec, 2017 11:26 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: మూడీస్‌ రేటింగ్‌తో ఆర్థిక వ్యవస్థపై జోష్‌ నెలకొంటే..తాజాగా ఫిచ్‌ రేటింగ్స్‌ నిరుత్సాహపరిచింది. ప్రస్తుత ఆర్థిఖ సంవత్సరంలో వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.7 శాతానికి ఫిచ్‌ తగ్గించింది. ఆశించిన మేర ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నెలకొనలేదని పేర్కొంది. మరోవైపు 2018-19 ఆర్థిక సంవ్సరానికి వృద్ధి అంచనాను సైతం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.

రాబోయే రెండేళ్లలో వ్యవస్ధాగత సంస్కరణల అజెండా అమలుతో పాటు వ్యక్తిగత వినిమయ ఆదాయాలు పెరగడంతో జీడీపీ వృద్ధి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. జీఎస్‌టీ,నోట్ల రద్దు కారణంగా ఇటీవల పలు క్వార్టర్లలో జీడీపీ వృద్ధి మందగించిందని అమెరికన్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ పేర్కొంది.

ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలు వృద్ధికి ఊతమిచ్చి, వ్యాపారాల్లో విశ్వాసం పెంచుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. బ్యాంకులకు మూలధన సాయం,రూ ఏడు లక్షల కోట్లతో రహదారుల నిర్మాణం వంటి చర్యలతో పెట్టుబడుల వాతావరణం ఊపందుకుంటుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు