స్కాం అనంతరం పీఎన్‌బీకి మరో షాక్‌ 

20 Feb, 2018 15:02 IST|Sakshi
పీఎన్‌బీ - నీరవ్‌ మోదీ స్కాం (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రభుత్వ రంగ రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు మరో షాక్‌ ఎదురైంది. రూ.11,400 కోట్ల కుంభకోణ నేపథ్యంలో పీఎన్‌బీ రేటింగ్‌ను నెగిటివ్‌లోకి మారుస్తున్నట్టు రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌, రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు మరో ఏజెన్సీ మూడీస్‌ ప్రకటించాయి. బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం పీఎన్‌బీలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీల డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌మోదీ ఈ మోసానికి పాల్పడ్డారు. అంతర్గతంగా, బహిర్గతంగా బ్యాంకు రిస్క్‌ కంట్రోల్స్‌పై ఈ మోసం పలు అనుమానాలకు తావిస్తుందని, గత కొన్నేళ్లుగా ఈ కుంభకోణం జరుగుతున్నప్పటికీ, ఎవరూ గుర్తించకపోవడం నిర్వహణ పర్యవేక్షణ నాణ్యతా లోపాన్ని ఎత్తిచూపుతుందని ఫిచ్‌ తెలిపింది.  పీఎన్‌బీకి ప్రతికూల పరిశీలనలో 'బీబీ'  వైబిలిటీ రేటింగ్‌ను ఇస్తున్నట్టు ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. వైబిలిటీ రేటింగ్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ క్రెడిట్‌ విలువను అంచనావేస్తుందని, ఇది సంస్థ విఫలమైనట్టు సూచిస్తుందని ఫిచ్‌ తెలిపింది.

రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌లో ఉంచుతున్నట్టు తెలిపిన మూడీస్‌ కూడా... మోసపూరిత లావాదేవీలు చూపుతున్న ఆర్థిక ప్రభావం, బ్యాంకు క్యాపిటలైజేషన్‌ ప్రొఫైల్‌ మెరుగుపరచడానికి మేనేజ్‌మెంట్‌ తీసుకుంటున్న చర్యలు, బ్యాంకుపై రెగ్యులేటరీ తీసుకునే చర్యలు వంటి వాటిపై ఫోకస్‌ చేసినట్టు పేర్కొంది. ఈ మోసపూరిత లావాదేవీల ఫలితంగా బ్యాంకు లాభాలు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాయని ఏజెన్సీ తెలిపింది. అయితే అసలైన ప్రభావం సమయం, అవసరాలకు అనుగుణంగా వుంటుందని ఏజెన్సీ చెప్పింది. బ్యాంకు బేస్‌లైన్‌ క్రెడిట్‌ అసెస్‌మెంట్‌(బీసీఏ), అడ్జస్టెడ్‌ బీసీఏ బీఏ3గా, కౌంటర్‌పార్టీ రిస్క్‌ అసెస్‌మెంట్‌ రేటింగ్‌ బీఏఏ3(సీఆర్‌)/పీ-3(సీఆర్‌)ను డౌన్‌గ్రేడ్‌ రివ్యూలో ఉంచుతున్నట్టు మూడీస్‌ తెలిపింది.
 

మరిన్ని వార్తలు