9బ్యాంకుల రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌: ఫిచ్‌ రేటింగ్స్‌

22 Jun, 2020 13:05 IST|Sakshi

లిస్టులో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు

ఫిచ్‌ రేటింగ్‌ ఏజెన్సీ భారత్‌కు చెందిన 9 బ్యాంకుల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తితో భారత్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటుందని అంచనా వేస్తూ ఈ  9బ్యాంకులకు సంబంధించి గతంలో కేటాయించిన ‘‘స్థిరత్వం’’ రేటింగ్‌ను ‘‘నెగిటివ్‌’’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఎస్‌బీఐ బ్యాంక్‌తో పాటు, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. ఇదే రేటింగ్‌ సంస్థ గతవారంలో (జూన్‌ 18న) భారత్‌ అవుట్‌లుక్‌ను ‘‘బిబిబి(-)’’ నుంచి ‘‘నెగిటివ్‌’’కి డౌన్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే.

‘‘కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి తర్వాత వ్యవస్థలో ఏర్పడిన సవాళ్లతో ఆర్థిక కొలమానాల్లో గణనీయమైన క్షీణతతో పాటు ఇటీవల భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ తగ్గింపుతో బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది.’’ ఫిచ్‌ రేటింగ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎస్‌బీఐకు అండగా ప్రభుత్వం: 
వ్యక్తిగత బ్యాంకులను పరిగణలోకీ తీసుకుంటే..,  వ్యూహాత్మక ప్రాధాన్యత కారణంగా అవసరమైతే ఎస్‌బీఐకు ప్రభుత్వం నుంచి మంచి మద్దతు లభిస్తోందని రేటింగ్‌ సంస్థ తెలిపింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఆస్తులు, డిపాజిట్లలో దాదాపు 25% మార్కెట్ వాటా కలిగి ఉంది. ఎస్‌బీలో 57.9 శాతం వాటా ప్రభుత్వం చేతిలో ఉంది. అలాగే తన సహచర బ్యాంకుల కంటే చాలా విస్తృత విధాన పాత్రను కలిగి ఉంది.ఐడీబీఐ బ్యాంక్‌ ఇష్యూయర్‌ డీఫాల్ట్‌ రేటింగ్‌ ను బీబీ(+)గా ధృవీకరించింది. అయితే అవుట్‌లుక్‌ మాత్రం నెగిటివ్‌గా కొనసాగింది. 


పిచ్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినప్పటికీ.., ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మిడ్‌సెషన్‌ సమయానికి.... 

  • ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు 3శాతం లాభంతో రూ.189.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 2శాతం ర్యాలీ చేసి రూ.370.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
  • యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 3శాతం పెరిగి రూ.430 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
మరిన్ని వార్తలు