వాట్సాప్‌ చాలెంజ్‌లో 5 స్టార్టప్‌ల ఎంపిక

19 Jun, 2019 10:42 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోని క్లిష్టమైన సమస్యలను టెక్నాలజీ ద్వారా పరిష్కరించేందుకు ఉద్దేశించిన వాట్సాప్‌ ఇండియా చాలెంజ్‌లో ఐదు స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. ఒక్కో స్టార్టప్‌కు రూ.35 లక్షలు (50 వేల డాలర్లు) ఫండింగ్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎంపికైన స్టార్టప్స్‌.. డిజిటల్‌ హెల్త్‌కేర్‌ మెడ్‌కార్డ్స్, వర్చువల్‌ రియాలిటీ కంటెంట్‌ మెల్జో, వాట్స్‌అప్‌ ఆధారిత ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ జావీస్, అగ్రిటెక్‌ గ్రామోఫోన్, రియల్‌ టైమ్‌ ఎలక్రిసిటీ లెవల్‌ మినీ ఆన్‌ ల్యాబ్స్‌. ఆయా స్టార్టప్స్‌లో పెట్టుబడులతో పాటూ భాగస్వాములమవుతామని వాట్స్‌అప్‌ ఇండి యా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో విదేశాల నుంచి టెక్నాలజీ కంటెంట్‌ను తీసుకొచ్చి.. మన దేశం, స్థానిక అవసరాలకు అనుగుణంగా సాంకేతికతలో మార్పులు చేసేవాళ్లమని, కానీ, ఇప్పుడు ఇన్‌హౌజ్‌ టెక్నాలజీ డెవలప్‌ చేసే స్థాయి కి స్టార్టప్స్, టెక్‌ కంపెనీలు ఎదిగాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు