ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

18 Sep, 2018 09:48 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : సోమవారం భారీగా కుదేలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, నేడు ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చాయి. 23 పాయింట్ల లాభంలో ప్రారంభమైన సెన్సెక్స్‌, ప్రస్తుతం 60 పాయింట్ల లాభంలో 37,645 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా ఫ్లాట్‌గా 15 పాయింట్ల లాభంలో 11,392 వద్ద కొనసాగుతోంది. ఫార్మా, మెటల్‌, ఎనర్జీ స్టాక్స్‌ దేశీయ మార్కెట్లకు మద్దతు ఇస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.7శాతం పడిపోయింది. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంక్‌, విజయ్‌ బ్యాంక్‌లు విలీనమవుతూ మెగా ప్రకటన విడుదల చేసినప్పటికీ, పీఎస్‌యూ బ్యాంక్‌లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 10 శాతం పడిపోగా.. దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ 10 శాతం నుంచి 20 శాతం లాభపడింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తూనే ఉంది. నేడు కూడా 57 పైసలు క్షీణించిన రూపాయి విలువ 72.43 వద్ద ట్రేడవుతోంది.
 

మరిన్ని వార్తలు