ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ మెగా సమ్మర్‌ సేల్స్‌ : భారీ డిస్కౌంట్లు

26 Apr, 2018 11:51 IST|Sakshi

కోల్‌కత్తా : ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ఈ సమ్మర్‌లో మెగా సేల్స్‌తో మన ముందుకు రాబోతున్నాయి. వచ్చే నెలలో మెగా సమ్మర్‌ సేల్స్‌ను ఇవి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఇవి అలరించబోతున్నాయని సీనియర్‌ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, అప్పీరెల్‌, హోమ్‌ డెకర్‌, రోజువారీ వస్తువులపై ఈ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందించనున్నాయని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ డిస్కౌంట్లో అప్పీరెల్‌, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై 70 శాతం నుంచి 80 శాతం వరకు, స్మార్ట్‌ఫోన్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటి ఫాస్ట్‌-మూవింగ్‌ కేటగిరీ వస్తువులపై అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఆన్‌లైన్‌ విక్రయాల్లో ఇవి 60 శాతానికి పైగా ఉన్నాయి. క్యాష్‌బ్యాక్‌, నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లతో అదనపు ప్రయోజనాలను కూడా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు అందించనున్నాయని తెలిపారు. 

ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి వచ్చే నెలలో ఈ సేల్‌ నిర్వహించనున్నట్టు ధృవీకరించారు. కానీ తేదీలను బహిర్గతం చేయడానికి నిరాకరించారు.‘ఇది చాలా పెద్ద సేల్‌. తమ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌కు చిన్న వెర్షన్‌. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు వంటి ఉత్పత్తులపై ఎక్కువగా ఫోకస్‌ చేశాం. టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇతర కేటగిరి ఉత్పత్తులు మాకు బిగ్‌ లైనప్‌. బ్యాంకులు కూడా ఈ సేల్‌లో ఆఫర్లను ప్రకటించనున్నాయి’ అని అమెజాన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ కూడా మే నెలలో ఒకే తేదీల్లో ఈ సేల్స్‌ను నిర్వహించనున్నాయని ఎక్స్‌క్లూజివ్‌లేన్‌ సహ వ్యవస్థాపకుడు ధృవ్‌ గోయల్‌ చెప్పారు. రెండు కంపెనీలకు ఈ సేల్స్‌ ఎంతో ముఖ్యమైనవని, తర్వాతి సేల్‌ సీజన్‌ దివాలీ సమయంలో ప్రారంభం కావొచ్చని పేర్కొన్నారు.  అయితే మే 11 నుంచి 14వ తేదీల వరకు ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌ను నిర్వహించనుందని కొందరు సెల్లర్స్‌ చెబుతున్నారు. అదే తేదీల్లో లేదా కాస్త ముందుగా అమెజాన్‌ కూడా ఈ సేల్స్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు