ఫ్లిప్కార్ట్ యూజర్లు- 10 కోట్లు

22 Sep, 2016 01:00 IST|Sakshi
ఫ్లిప్కార్ట్ యూజర్లు- 10 కోట్లు

బెంగళూరు: దేశీ దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ వినియోగదారుల సంఖ్య 10 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో భారత్ ఆన్‌లైన్ మార్కెట్ విభాగంలో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా ఫ్లిప్‌కార్ట్ అవతరించింది. ఫ్లిప్‌కార్ట్‌కు కేవలం ఆరు నెలల కాలంలో 2.5 కోట్ల మంది కొత్త కస్టమర్లు జత కావడం ఆశ్చర్యకరం. ఈ ఏడాది మార్చి నాటికి ఫ్లిప్‌కార్ట్ యూజర్ల సంఖ్య 7.5 కోట్లుగా ఉంది. తాజాగా ఇది 10 కోట్ల మార్క్‌కు చేరింది. దేశీ ఆన్‌లైన్ షాపింగ్ యూజర్లకు నాణ్యమైన వస్తువులను, అందుబాటు ధరల్లో అందించేందుకు ఎప్పుడూ ముందుంటామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బిన్నీ బన్సాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు