ఫ్లిప్‌కార్ట్‌లోకి మరో 70 కోట్ల డాలర్లు

21 Dec, 2014 17:09 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌లోకి మరో 70 కోట్ల డాలర్లు

బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పలు సంస్థల నుంచి తాజాగా మరో 70 కోట్ల డాలర్లను (సుమారు రూ. 4,200 కోట్లు) సమీకరించింది. తాజా నిధుల సమీకరణతో షేర్‌హోల్డర్ల సంఖ్య నిర్దేశిత 50కి మించడంతో ఫ్లిప్‌కార్ట్ .. సింగపూర్‌లో పబ్లిక్ కంపెనీగా నమోదు చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అక్కడి కంపెనీల నియంత్రణ సంస్థ ఏసీఆర్‌ఏకి దరఖాస్తు చేసుకుంది. అయితే, వీటిని పబ్లిక్ ఇష్యూ సన్నాహాలుగా భావించరాదని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం సమీకరించిన నిధులను భారత్‌లో దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు