ఫ్లిప్‌కా(స్టా)ర్ట్‌ సేల్‌, కొత్త ఏడాది ఆఫర్లు

1 Jan, 2020 12:09 IST|Sakshi

జనవరి 1-3 వరకు  ఫ్లిప్‌కార్ట్  ఫ్లిప్‌స్టార్ట్ డేస్ 

స్మార్ట్‌ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు,  ఆఫర్లు

సాక్షి, ముంబై:  ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌  న్యూ ఇయర్‌ సేల్‌ను ప్రకటించింది.  ఫ్లిప్‌స్టార్ట్‌ డేస్‌ సేల్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను  వినియోగదారులకు అందిస్తోంది. అలా 2020  ఏడాదిలో తొలి సేల్‌ను ప్రారంభించింది. జనవరి 1 అర్థరాత్రి  ప్రారంభమైన మూడు రోజుల సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై స్పెషల్‌ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రియల్‌మీ ఎక్స్‌ 2, రెడ్‌మి నోట్‌ 7 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. అలాగే  నో కాస్ట్‌ ఈఎంఐ, అదనపు డిస్కౌంట్లను అందించడానికి బ్యాంకులతో ఒప్పందాలు  కుదుర్చుకుంది ఫ్లిప్‌కార్ట్‌. ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం మినహాయింపుతో పాటు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. 

 స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్‌ డిస్కౌంట్లు
రియల్‌ మి5 ఎస్‌ : ఆఫర్‌ ప్రైస్‌ : రూ .9,999
(క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌, 64 జీబీ  స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌, క్వాడ్‌ కెమెరా 48 ఎంపీప్రైమరీ లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపీ సూపర్ మాక్రో లెన్స్ 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్‌ ప్రధాన ఫీచర్లు)

రియల్‌మీ ఎక్స్‌ 2:  ధర రూ .16,999 కు విక్రయిస్తోంది.  
(4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జీ సాక్‌ ప్రాసెసర్‌,  64 +82+ 2 ఎంపీ కెమెరా 32 ఎంపీ సెల్ఫీకెమరా ప్రధాన ఫీచర్లు)

రెడ్‌మి నోట్ 7 ప్రో  : రూ. 9,999 లభ్యం.
(4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6.3-ఇంచ్ ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 సాక్‌  డుబుల్‌ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరాప్రధాన ఫీచర్లు)

ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై కూడా ప్రత్యేక తగ్గింపునిస్తోంది.  ఏసర్ స్విఫ్ట్ 3 (ఇంటెల్ కోర్ ఐ 5, 2 జీబీ గ్రాఫిక్స్) ను రూ. 44.990.  మార్కెట్‌ ధర రూ. 50,000.

మరిన్ని వార్తలు