ఫ్లిప్‌కార్ట్‌ తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది..

10 Nov, 2017 11:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన తొలి బ్రిలియంట్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. క్యాప్చర్‌+ పేరుతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. నవంబర్‌ 15 నుంచి ఇది విక్రయానికి రాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన ఫీచర్లు.. డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు, అపరమిత క్లౌడ్‌ స్టోరేజ్‌.  సచిన్‌‌ బన్సాల్‌ అధినేత అయిన ప్రైవేట్‌ లేబుల్‌ ఆర్మ్‌, బిలియన్‌ బ్రాండు కింద ఫ్లిప్‌కార్ట్‌ దీన్ని రూపొందించింది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రత్యేక పేజీని కూడా ఏర్పాటు చేసింది. వేగవంతంగా ఛార్జింగ్‌ చేసుకునే సపోర్టును ఇది కలిగి ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ రివీల్‌ చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ లాంచ్‌ చేసింది. ఒకటి 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 10,999 రూపాయలు. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌. దీని ధర 12,999 రూపాయలు. మైస్టిక్‌ బ్లాక్‌, డిసర్ట్‌ గోల్డ్‌ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. నో కాస్ట్‌ ఈఎంఐ, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై డిస్కౌంట్లు ఈ ఫోన్‌పై లభించనున్నాయి. 

ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్‌ క్యాప్చర్‌+ ఫీచర్లు
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ
ఆండ్రాయిడ్‌ 7.1.2 నోగట్‌
5.5 అంగుళాల ఫుల్‌-హెచ్డీ డిస్‌ప్లే
3జీబీ, 4జీబీ ర్యామ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
13 మెగాపిక్సెల్‌తో వెనుకవైపు రెండు కెమెరాలు
8 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా