ఫ్లిప్‌‌కార్ట్‌ సరికొత్త ఆవిష్కరణ

17 Jun, 2020 16:29 IST|Sakshi

ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో తమ కస్టమర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటుంది. తాజాగా ఈ కామెర్స్‌ రంగంలో విపరీతమైన పోటీ నెలకొనడంతో ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇది వరకు నిత్యావసర వస్తువులు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండేవి కావని, కానీ తాజాగా స్థానిక స్టోర్స్‌ల సహాయంతో కేవలం 90 నిమిషాల్లోనే నిత్వావసర వస్తువులను డెలివరీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ కామర్స్‌లో జియో మార్ట్‌, అమెజాన్‌ సంస్థల రూపంలో ఫ్లిప్‌కార్ట్‌ తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది.

ఈ క్రమంలో పోటీ సంస్థలకు దీటుగా ఎదుర్కొవడానికి ఫ్లిక్‌కార్ట్‌ ప్రణాళికలు రూపొందించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా వినియోగదరులకు మెరుగైన సేవలందించేందుకు లాజిస్టిక్స్‌ సంస్థ షాడోఫాక్స్‌తో ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన గిడ్డంగులు, స్టోర్‌లతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్‌ మొదటగా బెంగుళూరులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అభిపప్రాయపడుతున్నారు. (చదవండి: అపుడు లాక్‌డౌన్‌ పరిస్థితి వచ్చి వుంటే..)

మరిన్ని వార్తలు