ఆసుస్‌తో ఫ్లిప్‌కార్ట్‌ : కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌

17 Apr, 2018 17:47 IST|Sakshi

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌, తైవనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఆసుస్‌ అధికారిక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా  లేటెస్ట్‌, గ్రేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయాలని ఆసుస్‌ నిర్ణయించింది. 2020 నాటికి అన్ని స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో 25 శాతం తానే పొందాలని ఫ్లిప్‌కార్ట్‌ కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని తమ బ్రాండ్‌ను పెంచుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఓ టెక్‌ దిగ్గజంతో తాము ఎక్స్‌క్లూజివ్‌ పార్టనర్‌షిప్‌ ఏర్పరుచుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి ఈ వారం మొదట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన సందర్భంగానే భారత్‌లో 100 మిలియన్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను యాడ్‌ చేసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 

ఇదే సమయంలో భారత కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని మేకిన్‌ ఇండియా ప్రొగ్రామ్‌లో భాగంగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయాలనుకుంటున్నట్టు ఆసుస్‌ సీఈవో జెర్రీ షేన్‌ తెలిపారు. ఏప్రిల్‌ 23న ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 4 మ్యాక్స్‌ ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతోన్నట్టు తెలిపారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేస్తూ లాంచ్‌ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ డివైజ్‌ను ఆసుస్‌ గతేడాది ఆగస్టులోనే రివీల్‌ చేసింది. కొన్ని కొన్ని మార్కెట్లలోనే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను ఆసుస్‌ ప్రకటించనప్పటికీ, రూ.15వేల నుంచి రూ.20వేల మధ్యలో ఈ ఫోన్‌ ధర ఉండనున్నట్టు తెలుస్తోంది.  ఈ ఫోన్‌కు 5.5 అంగుళాల ఎల్‌సీడీ ఐపీఎస్‌ డిస్‌ప్లే, 2.5డీ గ్లాస్‌, స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు