నోకియా సూపర్‌ స్మార్ట్‌ టీవీలు : ఫ్లిప్‌కార్ట్‌తో జత

6 Nov, 2019 20:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హెచ్‌ఎండీ  గ్లోబల్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి  సక్సెస్‌ను అందుకున్న నోకియా తాజాగా టీవీ  సెగ్మెంట్‌పై కూడా కన్నేసింది.   త్వరలోనే స్మార్ట్‌టీవీలను లాంచ్‌ చేయనుంది. ఇందులోభాగంగా ఈ కామర్స్‌ సంస్థ  ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతదేశంలో నోకియా స్మార్ట్ టీవీలను లాంచ్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ బుధవారం నోకియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుందని ఫ్లిప్‌కార్ట్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

భారతీయ వినియోగదారుల అవసరార్థం దేశీయంగా నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీల అభివృద్ధి, పంపిణీని సులభతరం చేయడానికి, ఎండ్-టు-ఎండ్, గో-టు-మార్కెట్ వ్యూహాన్ని నిర్వహించేందుకు ఫ్లిప్‌కార్ట్  పనిచేయనుందని తెలిపింది.  నోకియా బ్రాండ్‌తో భాగస్వామ్యం ద్వారా ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికామని చెప్పింది.  తద్వారా కొన్ని వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఫ్లిప్కార్ట్ తెలిపింది. అత్యాధునిక సౌండ్ నాణ్యత కోసం ఇందులో జేబీఎల్ సౌండ్ సిస్టంని ఉపయోగించనున్నారు. దీంతో భారతదేశ టీవీ రంగంలో జేబీఎల్ కూడా మొదటిసారి అడుగు పెడుతున్నట్లు అవుతుంది.   వినియోగదారులకు సౌండ్ సిస్టమ్‌నుఅందించేందుకు  జేబీఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఫ్లిప్‌కార్ట్‌ ప్రైవేట్ బ్రాండ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఫర్నిచర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,  హెడ్- ఆదర్ష్ మీనన్  తెలిపారు. ఈ టీవీలను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువచ్చేదీ, ధర, ఫీచర్లు సంబంధిత వివరాలను మాత్రం వెల్లడించలేదు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా