మళ్లీ ఆఫర్ల వెల్లువ : ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌

16 Jan, 2018 18:17 IST|Sakshi

సేల్స్‌ సీజన్‌ మళ్లీ వచ్చేసింది. అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ తేదీలను ప్రకటించిన వెంటనే, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా మూడు రోజుల ఆఫర్ల పండుగకు తెరతీయనున్నట్టు పేర్కొంది. రిపబ్లిక్‌ డే సేల్‌ను నిర్వహించనున్నట్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. జనవరి 21 నుంచి ఈ సేల్‌ ప్రారంభమై, జనవరి 23 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ సేల్‌ ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండటంతో, టాప్‌ ఆఫర్లతో కూడిన ప్రిప్యూ పేజీని  కంపెనీ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. 

ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించబోతున్న ఈ రిపబ్లిక్‌ డే సేల్‌లో డిస్కౌంట్లు, ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల లాంచింగ్‌లు ఉండనున్నాయి. అన్ని కేటగిరిల్లోని ఉత్పత్తులపై డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కొన్ని డీల్స్‌ను రివీల్‌ కూడా చేసింది. ల్యాప్‌టాప్‌లపై, ఆడియో, కెమెరా, యాక్ససరీస్‌లపై 60 శాతం వరకు తగ్గింపును, టీవీ, హోమ్‌ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు పేర్కొంది. 

స్మార్ట్‌ఫోన్‌ కేటగిరీలో కొన్ని టాప్‌ డీల్స్‌....

  • గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ తక్కువగా 48,999కే విక్రయించనున్నట్టు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై 10వేల రూపాయల తగ్గింపు కూడా లభించనుంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 60,499 రూపాయలు.
  • షావోమి ఎంఐ మిక్స్‌ 2ను 37,999 రూపాయలకు బదులు 29,999 రూపాయలకే అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ఈ ఫోన్‌ను గతేడాదే షావోమి లాంచ్‌ చేసింది
  • శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌ ధరను 26,990 రూపాయలకు తగ్గించింది. మిగతా రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 46వేల రూపాయలకు విక్రయిస్తోంది.
  • రెడ్‌మి నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ను 10,999కే అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. అసలు ఈ ఫోన్‌ ధర 12,999 రూపాయలు.
  • మోటో జీ5 ప్లస్‌ ధరను కూడా 16,999 రూపాయల నుంచి 10,999 రూపాయలకు తగ్గించింది.

కాగ, అమెజాన్‌ కూడా ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే ప్రైమ్ మెంబర్స్‌కు 12 గంటలు ముందుగానే అంటే జనవరి 20 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ కేటగిరీల్లో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై పది శాతం అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అంతేకాదు అమెజాన్ పే యూజర్స్ రూ.250 అంతకన్నా ఎక్కువ ధర కలిగిన ప్రోడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుకు పది శాతం బ్యాలెన్స్ బ్యాక్ (రూ.200 వరకు) ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు