స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు

25 Jul, 2018 19:56 IST|Sakshi
స్మార్ట్‌ఫోన్లు ఫైల్‌ ఫోటో

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఆరు రోజుల క్రితమే బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌తో కస్టమర్లను ఆఫర్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సేల్‌కు ఫ్లిప్‌కార్ట్‌ తెరలేపింది. జూలై 23 నుంచి జూలై 29 వరకు సూపర్‌ వాల్యు వీక్‌ సేల్‌ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ వీక్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఈ సూపర్‌ వాల్యు వీక్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జత కట్టింది. దీనిలో భాగంగా మూడు, ఆరు, తొమ్మిది నెలల ఇన్‌స్టాల్‌మెంట్స్‌ను ఎంపిక చేసుకున్న కస్టమర్లకు జీరో ఇంటరస్ట్‌ ఈఎంఐను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.

సూపర్‌ వాల్యు వీక్‌లో స్మార్ట్‌ఫోన్లపై అందించే టాప్‌ డీల్స్‌ ఇవే...
హానర్‌ 9 లైట్‌...
హువావే ఈ-బ్రాండులో బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్లలో హానర్‌ 9 లైట్‌ ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు రూ.1500 మినిమమ్‌ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌లో అందుబాటులో ఉంది. రూ.14వేల వరకూ ఈ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ను పొందవచ్చు. నెలకు రూ.625తో నో-కాస్ట్ ఈఎంఐ కూడా ప్రారంభమవుతోంది. 3000 రూపాయల డిస్కౌంట్‌ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.10,999కు అందుబాటులో ఉంది. 
వివో ఎక్స్‌21...
వివో ఎక్స్‌21 స్మార్ట్‌ఫోన్‌ రూ.35,990కు భారత్‌లో లాంచ్‌ అయింది. 7000 రూపాయల మినిమమ్‌ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. నెలకు  రూ.1500 నుంచి నో-కాస్ట్‌ ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఎక్స్చేంజ్‌పై రూ.21వేల తగ్గింపు లభిస్తుంది. యాక్సిస్‌ బ్యాంక్‌ బుజ్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అదనంగా 5 శాతం తగ్గింపును ఇస్తోంది.
ఒప్పో ఏ83...
3000 రూపాయల మినిమమ్‌ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌తో ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌ వాల్యు వీక్‌లో అందుబాటులో ఉంది. ఈ  స్మార్ట్‌ఫోన్‌ నెలకు రూ.1,555తో నో-కాస్ట్‌ ఈఎంఐతో ప్రారంభమవుతుంది. ఎక్స్చేంజ్‌పై రూ.13వేల వరకు తగ్గింపు లభిస్తుంది. 
ఒప్పో ఎఫ్‌5 యూత్‌..
ఒప్పో ఎఫ్‌5 యూత్‌ స్మార్ట్‌ఫోన్‌పై 3000 రూపాయల వరకు మినిమమ్‌ ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ లభిస్తోంది. నెలకు రూ.1,666తో నో-కాస్ట్‌ ఈఎంఐ అందుబాటులో ఉంది. రూ.14వేల వరకు ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ లభ్యమవుతోంది. 
హానర్‌ 9ఐ....
ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌ వాల్యు వీక్‌లో హానర్‌ 9ఐ స్మార్ట్‌ఫోన్‌ రూ.15,999కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ నెలకు రూ.667తో నో-కాస్ట్‌ ఈఎంఐ ప్రారంభమవుతుంది. రూ.15వేల వరకు ఎక్స్చేంజ్‌పై తగ్గింపు లభిస్తుంది. అదనంగా రెగ్యులర్‌ ఎక్స్చేంజ్‌ వాల్యులో వెయ్యి రూపాయల తగ్గింపు కూడా కస్టమర్లకు ఆఫర్‌ చేస్తుంది.
 

మరిన్ని వార్తలు