సీసీఐపై సంచలన ఆరోపణలు, హైకోర్టుకు ఫ్లిప్‌కార్ట్‌

21 Feb, 2020 18:40 IST|Sakshi

సీసీఐ ఉత్వర్వులను నిలిపివేయాలంటూ కర్నాటక హైకోర్టులో రిట్‌ పిటిషన్‌

సాక్షి, న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పై మరో ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. సీసీఐ దర్యాప్తు ఉత్వర్వులపై ఇటీవల హైకోర్టు నిలుపుదల ఇచ్చిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ మరో రిట్‌పిటీషన్‌ దాఖల​ చేసింది. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా  చాలా మూర్ఖమైన, ఏ మాత్రం  బుర్ర వాడకుండ సీసీఐ ఇచ్చిన ఆదేశాలంటూ  ఫ్లిప్‌కార్ట్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసు వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం వుందని భావిస్తున్నారు. అయితే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పిటిషన్లపై వాదలను కర్నాటక హైకోర్టు సంయుక్తంగా వింటుందా, లేక విడివిడిగా వింటుందా అనేది చూడాలి. 

దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ,  యాంటీ ట్రస్టు ఆరోపణలపై సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులను పక్కన పెట్టాలంటూ  ఫిబ్రవరి 18న పిటిషన్‌ వేసింది.  'ప్రైమా ఫేసీ' అంటే ఈ కామర్స్‌ సంస్థలు అనుసరిస్తున్న పద్ధతులు పోటీదారులకు హాని కలిగిస్తున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే సీసీఐ ప్రాధమిక దర్యాప్తునకు ఆదేశించిందని ఫ్లిప్‌కార్ట్  వాదించింది.  ఇ-కామర్స్ మేజర్లు భారీ డిస్కౌంట్లతో తమకు నష్టం కలిగిస్తున్నారన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) ఆరోపణలపై సంస్థ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత వుందని వాదించింది. అయితే పనికిమాలిన,  నిరాధారమైన ఆరోపణలపై స్పందించడంలో సీసీఐ విఫలమైందని ఆరోపించింది. తద్వారా తమ ప్రతిష్టకు భంగం కలగనుందని ఫ్లిప్‌కార్ట్‌ వాదించింది. అంతేకాదు తమ విలువైన సమయాన్ని కోల్పోవడంతో పాటు, చట్టపరమైన ఖర్చులు తప్పవని పేర్కొంది. 

కాగా పోటీ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్‌ సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఫిబ్రవరి 10 న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.  దీంతో ఫిబ్రవరి 14న హైకోర్టు స్టే విధించింది.  దీనిపై తమ స్పందనను ఎనిమిది వారాల్లోపల దాఖలు చేయాలని  ఫ్లిప్‌కార్ట్‌ సహా సీసీఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ను కోరింది. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తును మొదట పూర్తి చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు గత సంవత్సరం, విదేశీ మారకద్రవ్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిపై ఈడీ  దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

చదవండి :  ఉపశమనం కల్పించండి - అమెజాన్‌ 

ఈ-కామర్స్‌ సంస్థలకు భారీ ఊరట

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు

>
మరిన్ని వార్తలు