నేటి అర్థరాత్రి నుంచే ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్‌

19 Sep, 2017 11:45 IST|Sakshi
నేటి అర్థరాత్రి నుంచే ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్‌
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌ నాలుగు రోజులు పండుగ నేటి అర్థరాత్రి నుంచే ప్రారంభం కాబోతుంది. భారీ డిస్కౌంట్లతో 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించబోతుంది. నేటి అర్థరాత్రి నుంచి సెప్టెంబర్‌ 24 వరకు ఇది జరుగుతుంది. అన్ని కేటగిరీలపై 90 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. భారీ ఎత్తున్న డిస్కౌంట్లతో పాటు, ఫ్యాషన్‌, దుస్తులు, షూలు, గాడ్జెట్‌లు, హోమ్‌ అప్లియెన్స్‌పై ఎక్స్‌క్లూజివ్‌ డీల్స్‌ను అందిస్తోంది. తొలిసారి ఫ్లిప్‌కార్ట్‌ తన కస్టమర్ల కోసం డెబిట్‌ కార్డుపై ఈఎంఐ ఆప్షన్లను ఎంపికచేసుకునే స్పెషల్‌ స్కీమ్‌ను ప్రవేశపెడుతోంది. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌ అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ సేవింగ్స్‌ను పొందనున్నారు. 
 
ఫోన్లపై ఆఫర్లు...
బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 7ను కేవలం రూ.29,990కే అందించబోతుంది. దీని మార్కెట్‌ ధర 46వేల రూపాయలు. కొత్తగా లాంచ్‌ అయిన హానర్‌ 6 ఎక్స్‌, హానర్‌ 8 ప్రొలపై ఈ నాలుగు రోజులు స్పెషల్‌ డీల్స్‌ను అందుబాటులో ఉంచుతుంది. 
 
వస్త్రాలు...
మహిళలు, పురుషుల వస్త్రాలపై కంపెనీ 50 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. 
 
టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు వంటి వాటిపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాక గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను సగం ధరకే అందించనున్నట్టు తెలిపింది. ఇవి మాత్రమే కాక, బిగ్‌ బిలియన్‌ సేల్‌లో ఉత్పత్తులు, బ్రాండులపై నో కాస్ట్‌ ఈఎంఐ, ప్రొడక్ట్‌ ఎక్స్చేంజ్‌, బై బ్యాక్‌ గ్యారెంటీ, బై నౌ పే లేటర్‌ వంటి ఫైనాన్సింగ్‌ ప్రొగ్రామ్‌లను ప్రవేశపెడుతోంది. 
మరిన్ని వార్తలు