ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్‌

22 Feb, 2018 16:38 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్‌

ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్‌ సేల్‌కు తెరలేసింది. ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యంలో మోటోరోలా మూడు రోజుల పాటు ఈ ప్రమోషనల్‌ సేల్‌ను నిర్వహిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ ఫిబ్రవరి 24 వరకు జరుగనుంది. మోటో డేస్‌ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన మోటోరోలా ఫోన్లు మోటో ఈ4 ప్లస్‌, మోటో ఎక్స్‌4, మోటో జెడ్‌2 ప్లే స్మార్ట్‌ఫోన్లు డిస్కౌంట్‌లో లభించనున్నాయి. 
 

మోటో డేస్‌ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌...

  • మోటో ఈ4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ రూ.9,499కి లిస్టు చేసింది. గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఫోన్‌ అసలు ధర రూ.9,999. అదనంగా ఈ ఫోన్‌ ఎక్స్చేంజ్‌పై రూ.2000 తగ్గింపును ఇస్తోంది. దీంతో మొత్తంగా మోటో ఈ4 ప్లస్‌ ధర రూ.7,499కు దిగొచ్చింది. అయితే ఈ ఎక్స్చేంజ్‌ కూడా ఎంపిక చేసిన ఫోన్లపైనే ఇస్తారు. ఫైన్‌ గోల్డ్‌, ఐరన్‌ గ్రే రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఫోన్‌ ఈ ఆఫర్‌ కింద లిస్టు అయి ఉంది.
  • కొత్తగా లాంచ్‌ అయిన మోటో ఎక్స్‌4 ధరను కూడా ఫ్లిప్‌కార్ట్‌ రూ.20,999 నుంచి రూ.18,999కు తగ్గించింది. అదనంగా ఎక్స్చేంజ్‌పై మరో రెండు వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది. 
  • మోటో జెడ్‌2 ప్లేను కంపెనీ గతేడాది లాంచ్‌చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అ‍త్యంత పాపులర్‌ ఫోన్‌గా పేరొందింది. ఈ ఫోన్‌ లాంచింగ్‌ ధర రూ.27,999 కాగ, ప్రస్తుతం దీన్ని ఫ్లిప్‌కార్ట్‌ రూ.22,999కే అందుబాటులోకి తెచ్చింది. అదనంగా ఈ ఫోన్‌పై కూడా రెండు వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది.  
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు