2జీ స్కామ్‌ తీర్పు: ఆర్బిట్రేషన్ల వరద?

23 Dec, 2017 13:53 IST|Sakshi

2జి స్పెక్ట్రమ్ కేసులో మొత్తం 17 మంది నిందితులను ప్రత్యేక సిబిఐ కోర్టు  నిర్దోషులుగా  ప్రకటించడంతో ఆర్బిట్రేషన్ల వరద పోటెత్తునుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెలికాం తప్పుడు విధానాలతో నష్టపోయినందుకుగాను ఆయా కంపెనీలు భారీ ఎత్తున నష్టపరిహారం కోరనున్నారని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా లూప్ టెలికాం, రష్యాకు చెందిన  సిస్టెమా, టెలినార్ లాంటి ఆపరేటర్లు తమ  వ్యూహాలను మార్చనున్నాయి.   మరోవైపు ఇప్పటికే ఈ  విషయంలో దేశీయ ఆపరేటర్‌  వీడియోకాన్‌ నష్టాన్ని పూడ్చుకునే పనిలో వేగంగా పావులు కదుపుతోంది.

మరోవైపు 2జీ స్కాంపై తాజా తీర్పుతో  భారత టెలికాం రంగానికి చెందిన విదేశీ కంపెనీలకు ఇది తలుపులు తెరిచిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసిన 122 లైసెన్సుల రద్దు చేసిన సంస్థలు దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని, వీటిని పునఃప్రారంభించడానికి  లేదా  ప్రభుత్వం నుంచి  నష్టపరిహారం కోరవచ్చని అశిష్‌ భాన్‌ అభిప్రాయపడ్డారు. సిస్టెమా, టెలినార్‌పై విచారణ జరపలేదు. ఒక వేళ వారు  మారిషస్ ద్వారా పెట్టుబడి పెట్టినట్లయితే .. వారికిది మంచి అవకాశమని  ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తెలిపారు.

అలాగే పటియాల హౌస్‌ కోర్టు తీర్పును హైకోర్టులో  సవాలు చేయాలన్న ఈడీ, సిబిఐ నిర్ణయం ప్రస్తుత పరిస్థితిని పెద్దగా మార్చలేదని  చెప్పారు. ఈ కేసులో ఎటువంటి నేరారోపణ లేదని నిరూపించడానికి ప్రత్యేక సిబిఐ కోర్టుకు ఏడు సంవత్సరాలు పట్టింది.  ప్రత్యేక సిబిఐ కోర్టు పరిశీలించిన సాక్షాధారాల్లో లొసుగులను హైకోర్టు  గుర్తించకపోతే, హైకోర్టు జోక్యం సులభం కాదని బన్‌ పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే వీడియోకాన్‌ ​ప్రభుత్వాన్నిసవాల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలాంటి తప్పులేకుండానే తాము రూ.25 వేలకోట్లను నష్టపోయామని వాదిస్తోంది. తాజా తీర్పుతో ప్రభుత్వంనుంచి పరిహారాన్ని కోరేందుకు మరింత బలం చేకూరిందని పేరు చెప్పడానికి ఇష్టపడని  సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  2015 లో టెలికాం ట్రిబ్యునల్‌లో  ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు ఫైల్‌ చేసింది.  రూ.10వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు