సంప్రదాయాన్నే పాటించిన జైట్లీ

1 Feb, 2018 11:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వ చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను నేడు(ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టారు. అయితే ఈసారి ఆర్థిక మంత్రి సంప్రదాయాన్ని బ్రేక్‌ చేస్తారని, తొలిసారి హిందీలో బడ్జెట్‌ను ప్రసంగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అంచనాలకు భిన్నంగా  ఆయన సంప్రదాయాన్నే కొనసాగించారు. అందరికీ అర్థమయ్యేలా జైట్లీ ఎప్పటి లాగనే, ఆంగ్లంలోనే బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.

జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌  కావడం మరో విశేషం. జీఎస్టీ అమలుతో పేదలకు మేలు జరిగిందన్నారు. అంచనా వేసిన విధంగా బడ్జెట్‌ ప్రసంగంలో మొట్టమొదట రైతుల కోసం తీసుకోయే సంస్కరణలపై ప్రసంగించడం ప్రారంభించారు. ఈ ఏడాది అగ్రకల్చర్‌ రూరల్‌ ఎకానమీపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు మంత్రి చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్‌ ఉందన్నారు. 

మరిన్ని వార్తలు