శాంసంగ్‌కు పంచ్‌: తొలి ఫోల్డింగ్‌ ఫోన్‌ వచ్చేసింది

3 Nov, 2018 13:37 IST|Sakshi

బీజింగ్‌: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను చైనా కంపెనీ రాయొలే కార్పొరేషన్‌ విడుదల చేసింది. గత కొంతకాలంగా శాంసంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో చైనా కంపెనీ పైచేయి సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాయొలే కార్పొరేషన్‌ బీజింగ్‌లో అక్టోబర్‌31న ఈ ఫోన్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. చూడ్డానికి ట్యాబ్‌లా కనిపించినా.. మధ్యలోకి ఫోల్డ్‌ చేసే వాడుకునేలా దీన్ని రూపొందించింది. ఇందులో మరో విశేషమేమంటే రెండు కెమెరాలు వెనుక భాగాన ఉంటాయి. అయితే ఫోన్‌ మడిచినపుడు ఒక కెమెరా  సెల్ఫీ కెమెరాగా ఉపయోగపడుతుంది. 

7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతబెట్టొచ్చు. మడిచిన తర్వాత ఇది డ్యుయల్‌ స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. ఫ్లెక్స్‌ పై గా  పిలుస్తున్న ఈ ఫోన్‌ 20మెగాపిక్సెల్‌ టెలిఫొటో లెన్స్‌తో పాటు 16ఎంపీ  వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ డ్యుయల్‌ కెమెరాలు ఇందులో ఉన్నాయి. దాదాపు 2లక్షల సార్లు పరీక్షించి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశామని కంపెనీ  ప్రకటించింది. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్లతో  పోలిస్తే తమ ఫోల్డబుల్‌ ఫోన్లు వినియోగదారులకు వివాత్మక, విభిన్నమైన అనుభవాన్నందిస్తుందని  రాయొలే సీఈవో, వ్యవస్థాపకుడు డాక్టర్ బిల్ లియూ  అన్నారు.

ఫ్లెక్స్‌  పై  ఫీచర్లు
7.8 అంగుళాల డిస్‌ప్లే 
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8150 ప్రాసెసర్‌
6జీబీ / 8జీబీ ర్యామ్‌,
128జీబీ/256జీబీ/512జీబీ  స్టోరేజ్‌
 3800 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం 

royole.com/flexpai ద్వారా ఈ ఫోన్‌ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి.128జీబీ ఇంటర్నల్‌ ఇంటర్నల్‌ స్టోరేజీ ఫోన్‌ ధర1,318 డాలర్లు, (సుమారు రూ.94,790) 256జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర 1,469 డాలర్లుగా (లక్షా డెబ్భై వేల రూపాయలు) నిర్ణయించింది. డిసెంబరులో ఈ ఫోన్ల డెలివరీ చేయనున్నారట. ఇక  ఈ అమేజింగ్‌ ఫోన్‌  భారత మార్కెట్లో లాంచింగ్‌ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మరోవైపు శాంసంగ్‌, ఎల్‌జీ కంపెనీలఫోల్డింగ్‌ ఫోన్‌ 2019, జనవరిలో లాంచ్‌ కానుందని భావిస్తున్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’