మిలియన్‌ మార్క్‌ను దాటిన ఫోర్డ్‌ ఇండియా

23 Jul, 2018 20:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా తక్కువ సమయంలోనే పది లక్షల కార్లను విక్రయించి రికార్డును సృష్టించింది. ఢిల్లీకి చెందిన నిఖిల్‌ కక్కర్‌ అనే వినియోగదారుడి విక్రయంతో పోర్డ్‌ ఇండియా సంస్థ మిలియన్‌ మార్క్‌ను దాటింది. సంస్థ తయారుచేసిన మిలియన్‌ మార్క్‌ వాహనం.. భారత దేశపు మొదటి కాంప్యాక్ట్‌ యుటిలిటీ వాహనం ఫోర్డ్‌ ఫ్రీస్టైల్‌.. ఈ వాహనాన్ని  ఫోర్డ్‌ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ మెహరోత్రా చేతుల మీదుగా నిఖిల్‌ కక్కర్‌కు అందించారు. ఈ సందర్భంగా అనురాగ్‌ మాట్లాడుతూ.. భారతదేశంలో తమ సంస్థ మిలియన్‌ వినియోగదారులను కలిగి ఉండటం సంతోషాన్ని కల్గిస్తోందన్నారు. తమపై నమ్మకం, విశ్వాసాన్ని ఉంచిన వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. వినియోగదారుల నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్త ఫీచర్లతో మన్నికైన వాహనాలను అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజమైన ఫోర్డ్‌ 1998 నుంచి తన వాహనాలను ఇండియాలో తయారుచేస్తోంది. సురక్షిత, నాణ్యతలకు గుర్తింపు దక్కించుకున్న ఫోర్డ్‌ భారత మార్కెట్‌లో దూసుకెళ్తోంది. ఫిగో అండ్‌ ఎకోస్పోర్ట్‌, ఐకాన్‌, ఎండీవర్‌, ఫియెస్టా  తదితర ప్రజాదరణ పొందిన మోడళ్లను ఫోర్డ్‌ ఇండియా తయారు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఫోర్డ్‌ ఇండియా విభాగానికి దేశవ్యాప్తంగా 267 నగరాల్లో, పట్టణాల్లో 465కు పైగా సెల్స్‌, సర్వీస్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి.


 

>
మరిన్ని వార్తలు