మూడేళ్లలోనే ఫోర్డ్ ఆయన్ని దించేసింది

22 May, 2017 19:02 IST|Sakshi
మూడేళ్లలోనే ఫోర్డ్ ఆయన్ని దించేసింది
ఫోర్డ్ మోటార్ కంపెనీ మూడేళ్లలోనే తన సీఈవో మార్క్ ఫీల్డ్స్ ను పదవి నుంచి దించేసింది. ఆయన అవలంభిస్తున్న వ్యూహాలపై విసుగెత్తిన ఫోర్డ్ మోటార్, మార్క్ ఫీల్డ్స్ స్థానంలో జిమ్ హాకెట్ ను కంపెనీ కొత్త సీఈవోగా, అధ్యక్షుడిగా నియమించింది. స్టాక్ ఫర్ ఫార్మెన్స్, లాభాలు నిరాశపరుస్తుండటంతో ఇటీవల షేర్ హోల్డర్స్ ను కంపెనీ బోర్డుపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.  2017 ప్రారంభం నుంచే మార్క్ ఫీల్డ్స్ ను మార్చే ప్రక్రియను బోర్డు చేపట్టిందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఆటో పరిశ్రమ ట్రాన్స్ ఫర్మేటివ్ దశలో ఉందని, ఈ దశలో కంపెనీకి సరియైన  సీఈవో జిమ్ హాకటేనని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ఫీల్డ్స్ 2014లో కంపెనీ సీఈవోగా  బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫోర్డ్ మోటార్ స్టాక్ ధర కనీసం 40 శాతం మేర పడిపోయింది. మార్క్ ఎక్కువగా వందల కోట్ల కొద్దీ మొత్తాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రైడ్-షేరింగ్ ఎక్స్ పర్మెంట్లపైనే వెచ్చిస్తున్నారు. దీంతో కంపెనీ సంప్రదాయ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతుందని బోర్డు సభ్యులు గత కొంతకాలంగా మండిపడుతూనే ఉన్నారు. అసలకే నెమ్మదించిన అమెరికా మార్కెట్లో తన ప్రత్యర్థి జనరల్ మోటార్స్ కంపెనీతో పోటీపడటం కంపెనీకి క్లిష్టతరంగా మారింది. ఫోర్డ్ తన మార్చి క్వార్టర్ ఫలితాల్లోనూ 42 శాతం పడిపోగా, జనరల్ మోటార్స్ లాభాలను నమోదుచేసింది. 
 
మరిన్ని వార్తలు