2 నెలల్లో 11 బిలియన్ డాలర్ల ప్రవాహం..

9 Mar, 2015 00:33 IST|Sakshi
2 నెలల్లో 11 బిలియన్ డాలర్ల ప్రవాహం..

ఈ ఏడాది తొలి రెండు నెలల్లో భారత్ మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ప్రవాహం పోటెత్తింది. జనవరి నుంచి ఇప్పటిదాకా నికరంగా స్టాక్స్, డెట్(బాండ్‌లు) మార్కెట్లోకి నికరంగా 11 బిలియన్ డాలర్ల(రూ.68,000 కోట్లకుపైనే) నిధులను కుమ్మరించారు. మార్చి 5 నాటికి ఎఫ్‌పీఐలు స్టాక్స్‌లో రూ.31,250 కోట్లు, బాండ్‌లలో 37,296 కోట్ల నికర ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్లు సీడీఎస్‌ఎల్ గణాంకాలు పేర్కొన్నాయి. అంటే సగటున రోజుకు రూ.1,000 కోట్లకుపైనే పెట్టుబడులు వచ్చినట్లు లెక్క.

కాగా, తాజా బడ్జెట్‌లో వివాదాస్పదమైన జనరల్ యాంటీ అవాయ్‌డెన్స్ రూల్(గార్) అమలును మరో రెండేళ్లు వాయిదా వేయడం తదితర సానుకూలతలతో విదేశీ నిధులు మరింత పెరగనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. 2014లో నికరంగా డెట్ మార్కెట్లోకి రూ.1,57 లక్షల కోట్లు, స్టాక్స్‌లోకి రూ.97,054 కోట్లను వెచ్చించారు.

మరిన్ని వార్తలు