కొత్త గరిష్టానికి

23 May, 2015 01:47 IST|Sakshi

- విదేశీ మారక నిల్వలు
ముంబై:
భారత విదేశీ మారక నిల్వలు కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. మే 15తో ముగిసిన వారంలో 1.745 బిలియన్ డాలర్లు పెరిగి 353.876 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ అసెట్స్ పెరగడం ఇందుకు తోడ్పడింది. అంత క్రితం వారంలో విదేశీ మారక నిల్వలు 262.4 మిలియన్ డాలర్లు పెరిగి 352.131 బిలియన్ డాలర్లకు చేరాయి.

తాజాగా విదేశీ కరెన్సీ అసెట్స్ 1.708 బిలియన్ డాలర్ల మేర ఎగియగా, పసిడి నిల్వలు 19.335 బిలియన్ డాలర్ల స్థాయిలో స్థిరంగా ఉన్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 27.8 మిలియన్ డాలర్లు పెరిగి 4.090 బిలియన్ డాలర్లకు చేరాయి.

మరిన్ని వార్తలు