ఎన్‌ఎస్‌ఈఎల్ స్కాంలో మాజీ సీఎఫ్‌వో అరెస్టు

19 Jan, 2019 10:35 IST|Sakshi

నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) కుంభకోణంలో 63మూన్‌ టెక్నాలజీస్‌(గతంలో ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌) మాజీ సీఎఫ్‌వో శశిధర్‌ కొటైన్‌ను అధికారులు అరెస్ట్‌ చేశారు. 5600కోట్ల రూపాయల కుంభకోణం కేసులో శుక్రవారం  ఆర్థిక  నేరాల ప్రత్యేక వింగ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం ఆయన్ను జనవరి 28వరకు  కస్టడీకి తరలించారు. 

13వేలమందికి పైగా ఇన్వెస్టర్లను  మోసం చేసిన వ్యవహారంలో 2013, జూలైలో కేసు నమోదైంది.  అలాగే జిగ్నేష్‌ షా ఆధ్వర్యంలోని సంస్థను రెగ్యులేటరీ స్వాధీనంలోకి వెళ్లింది. అలాగే సంస్థ  కీలక అధికారులకు, పలుడైరెక్టర్లను ఇప్పటికే  అరెస్టు చేసిన ముంబై పోలీసులు  2018, డిసెంబరులో  27మంది సహా, దాదాపు 63 సంస్థలు,  36 కంపెనీలపై చార్జ్‌షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు