అరుంధతీ కాదు‌: కొత్త చైర్మన్‌ ఈయనే

12 Apr, 2018 18:37 IST|Sakshi
బీబీబీ చైర్మన్‌ భాను ప్రతాప్‌ శర్మ(ఫైల్‌ ఫోటో)

సాక్షి,న్యూఢిల్లీ:  బ్యాంకు బోర్డు ఆఫ్‌  బ్యూరో (బీబీబీ)కి చైర్మన్‌గా  భాను ప్రతాప్‌ శర్మను  ప్రభుత్వం నియమించింది.  ప్రస్తుతం బీబీబీ మొట్టమొదటి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వినోద్ రాయ్‌ స్థానంలో  డిపార్ట్‌మెంట్‌ పర్సనల్‌  అండ్‌ ట్రైనింగ్‌  మాజీ డిప్యూటీ కార్యదర్శి భాను ప్రతాప్‌ శర్మను ఎంపిక చేసింది.  ఆయన పదివీకాలం రెండు సంవత్సరాలని  ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు.   ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సీనియర్ లెవల్ నియామకాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదనే మాటకుతాము కట్టుబడి ఉన్నామంటూ ఆయన ట్వీట్‌ చేశారు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  టాప్‌ మేనేజ్‌మెంట్‌ను ఎంపిక చేసేందుకు కొత్త బీబీబీలో విభిన్న నైపుణ్యాలతో  కూడిన నిపుణులున్నారన్నారు.

బీబీబీలో ఇతర సభ్యులు: వేదికా భండార్కర్ (మాజీ ఎండీ క్రెడిట్ సూయిస్‌ ఇండియా), పి ప్రదీప్ కుమార్ (మాజీ ఎండీ.ఎస్‌బీఐ), ప్రదీప్ పి.షా (వ్యవస్థాపకుడు, ఎండీ క్రిసిల్).  కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనా వ్యవహారాలను మెరుగుపర్చేందుకు 2016లో ఈ బీబీని ప్రభుత్వం ఏర్పాటు  చేసింది. మరోవైపు ఈ పదవికి  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్య  ఎంపిక కానున్నారని ఇటీవలి పలు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు