ఫోర్టిస్, ఎస్‌ఆర్‌ఎల్‌ల విలీనం రద్దు

15 Jun, 2018 00:48 IST|Sakshi

సుదీర్ఘ జాప్యమే కారణం

విలీన ప్రతిపాదన ఉపసంహరించుకున్న ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ మలార్‌ హాస్పిటల్స్, ఎస్‌ఆర్‌ఎల్‌ (డయాగ్నస్టిక్స్‌ విభాగం) విలీనం రద్దయింది. ఈ రెండు సంస్థల విలీనాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తెలిపింది. ఈ రంగంలో సమస్యలు ప్రబలంగా ఉండటం, విలీన ప్రక్రియలో సుదీర్ఘ జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.

ఈ రెండు సంస్థల విలీనం 6–8 నెలల్లో పూర్తవ్వగలదని అంచనా వేశామని, కానీ తమ నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ ప్రక్రియ 19 నెలలుగా సాగుతోందని తెలిపింది. ఇంత సుదీర్ఘ కాలం జరిగినా ఇంకా విలీనం పూర్తవ్వలేని పేర్కొంది. కాగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) చండీగఢ్‌ బెంచ్‌ వద్ద ఈ విలీన స్కీమ్‌ పెండింగ్‌లో ఉందని తెలిపింది.

ఈ 19 నెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎన్నో సమస్యలు చోటు చేసుకున్నాయని, డయాగ్నస్టిక్స్‌ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. అందుకు విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, దీనికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం పొందాల్సి ఉందని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు