ఈ ఒక్కరోజే రూ. 5లక్షల కోట్ల సంపద ఆవిరి

2 Feb, 2018 19:05 IST|Sakshi

సాక్షి, ముంబై:  దలాల్‌స్ట్రీట్‌లో బడ్జెట్‌  ప్రతిపాదనలను ప్రకంపనలు  పుట్టించాయి.  వారాంతంలోస్టాక్‌మార్కెట్‌లో ఈ శుక్రవారం టెర్రర్‌ డేగా నిలిచింది. ముఖ‍్యంగా అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు లాంగ్‌టెర్మ్‌  క్యాపిటల్‌ గెయిన్స్‌ 10శాతం పన్ను  ఇ‍న్వెస్టర్లలో తీవ్ర భయాందోళన రేపింది. దీంతో అమ్మకాల ఒత్తిడి భారీగా  నెలకొంది.   దీంతో  దేశీయ ఈక్విటీలు 70 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ ఒక్కరోజులోనే సుమారు 50లక్షల కోట్ల  ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బిఎస్ఇలో లిస్ట్‌ అయిన కంపెనీల   కంబైన్డ్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .4.7 లక్షల కోట్లు మేర పడిపోయింది.  

ఇది ఇలా వుంటే ఈ పతనం సోమవారం కూడా  స్టాక్‌మార్కెట్లో నష్టాలు కొనసాగే అవకాశం ఉందని  క్వాంటమ్‌  సెక్యూరిటీస్‌కు చెందిన నీరజ్ దీవాన్ తెలిపారు. బాగా పెరిగిన మిడ్‌ క్యాప్‌ వాల్యుయేషన్‌ లాంటివి మార్కెట్‌ పతనానికి  అనేక కారణాలున్నప్పటికీ  కీలక సూచీలను బడ్జెట్‌  కూడా ప్రభావితం చేసినట్టు చెప్పారు. బడ్జెట్‌కంటే7-8 రోజుల ముందే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేపట్టడం మంచిదైందన్నారు. ఈ తరుణంలో మార్కెట్లకు ఎక్కడ నిలుస్తాయో చెప్పడం కష్టమన్నారు.   మరోవైపు  ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన  ఈక్విటీ మార్కెట్లలో ఈ కరెక్షన్‌  మంచి పరిణామమని ఎనలిస్టులు  పేర్కొన్నారు. ఈ వీకెనెస్‌ మరో రెండు నెలలు కొనసాగుతుందని,  తరువాత మార్కెట్లకు  సానుకూలమేనని ఎలారా క్యాపిటల్‌  ఎండీ హరీంద్ర కుమార్‌  అభిప్రాయపడ్డారు. 

కాగా దేశీయ స్టాక్‌మార్కెట్లలో  సెన్సెక్స్‌  2.34 శాతం (839పాయింట్లు) నష‍్టంతో, నిఫ్టీ 2.36 శాతం(256పాయింట్లు)  భారీ నష్టంతో  ముగిశాయి.  మిడ్‌క్యాప్‌, స్మాల్‌కాప్‌  సెక్టార్లు 4శాతం నష్టపోయాయి.  2016, నవంబరు తరువాత  ఇదే అది పెద్ద పతనంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  
 

మరిన్ని వార్తలు