బ్యాక్టీరియా భయం : రెండోసారి భారీ రీకాల్‌

21 Dec, 2017 14:16 IST|Sakshi

పారిస్:  ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ,  ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్‌  మరోసారి భారీ రీకాల్‌ చేపట్టింది. తాము తయారు చేసిన  బేడీ పౌడర్‌లో అతిప్రమాదకరమైన  సాల్మొనెల్లా బాక్టీరియా ఉందంటూ 7వేల టన్నుమేర  గ్లోబల్‌ రీకాల్‌ చేపట్టిన సంస్థ తాజా మరోసారి తమ  ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ముందు ప్రకటించిన దానికంటే రెట్టింపు సంఖ‍్యలో ఈ రీకాల్‌  చేస్తున్నామిన గురువారం సం‍స‍్థ వెల్లడించింది.

రెండు వారాల వ్యవధిలో రెండోసారి సాల్మొనెల్లా భయాందోళనలకారణంగా   దాదాపు రెట్టింపు  పరిమాణంలో మరోసారి రీకాల్‌ చేస్తున్నట్టు తాజాగా  ప్రకటించింది. తాజా రీకాల్ ఫ్రాన్‌ సహా  విదేశాలలో విక్రయించే 720 బ్యాచ్ ఉత్పత్తులు ఉన్నాయి

కాగా   ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. గ్లోబల్‌గా  625 బ్యాచ్‌లను లేదా దాదాపు 7,000 టన్నుల ఉత్పత్తులను మార్కెట్‌నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు డిసెంబర్ 10 న ప్రకటించిన సంగతి తెలిసిందే.  సాల్మొనెల్లా ( జంతువుల లేదా మానవుల మలంతో  కలుషితమైన) బాక్టీరియా కారణంగా చాలామంది పిల్లలు అస్వస్థతకు గురికావడంతోపాటు  ఫ్రాన్స్‌ ఆరోగ్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా ఆహారం విషతుల్యంగా మారి పిల్లలో డయేరియా, కడుపు తిమ్మిరి,  వాంతులు తదితర లక్షణాలు వ్యాపించాయి. డిసెంబరు ప్రారంభంలో దేశంలో 26 మంది శిశువులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో  బ్రిటన్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సూడాన్‌ సహా పలు దేశాలకు ఎగుమతులపై ప్రభావం చూపనుంది. కాగా  అతి ముఖ్యమైన బేబీ  పౌడర్‌ లేదా పాల పొడి ఉత్పత్తులు అతి ప్రమాదకరమైన బాక్టీరియా ప్రభావానికి గురికావడం ఇదే మొదటి సారి  కాదు.  చైనాకు చెందిన ఓ కంపెనీ   తయారు చేసిన పాల పౌడర్‌లో   పారిశ్రామిక రసాయనం మెలామైన్‌  కలవడంతో 2008 లో ఆరుగురు పిల్లలు మరణించారు.  సుమారు 3లక్షలమంది  పిల్లలతో సహా ఇతరులు కూడా అనారోగ్యం పాలయ్యారు.
 

మరిన్ని వార్తలు