ఎక్సైడ్ లైఫ్ నుంచి ‘వెల్త్ మ్యాక్సిమా’

31 Aug, 2015 00:53 IST|Sakshi
ఎక్సైడ్ లైఫ్ నుంచి ‘వెల్త్ మ్యాక్సిమా’

అందుబాటులోకి 3 బీమా పథకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
సంపద సృష్టిని గరిష్టం చేసుకోవడంతో పాటుగా జీవితానికి బీమానందించేందుకు మూడు రకాల జీవిత బీమా ప్లాన్లను ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. అవి మ్యాక్సిమా ఇన్వెస్ట్, మ్యాక్సిమా ఫ్యామిలీ, మ్యాక్సిమా చైల్డ్ ప్లాన్లు. రిస్క్ ధోరణిలకు, అవసరాలకు అనుగుణంగా ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారేందుకు కూడా ఇందులో వీలుంటుంది. మ్యాక్సిమా ఇన్వెస్ట్ ప్లాన్ అంటే.. లైఫ్ కవర్ మొత్తం లేదా అక్యుములేటెడ్ ఫండ్ వ్యాల్యూలో రెండిట్లో ఏది ఎక్కువైతే అది అందుతుంది.

మ్యాక్సిమా ఫ్యామిలీ అంటే.. లైఫ్ కవర్, అక్యుములేటెడ్ ఫండ్ వ్యాల్యూ రెండింటినీ కుటుంబం పొందుతుంది. మ్యాక్సిమా చైల్డ్ అంటే.. లైఫ్ కవర్ మొత్తాన్ని కుటుంబం వెంటనే పొందటంతో పాటుగా దీనికి అదనంగా ఈ ప్లాన్ ఆప్షన్ ప్రీమియం బెనిఫిట్‌ను అందిస్తుంది.సంపద సృష్టిని గరిష్టం చేసుకోవడంతో పాటుగా జీవితానికి బీమానందించేందుకు మూడు రకాల జీవిత బీమా ప్లాన్లను ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది.

మరిన్ని వార్తలు