విద్యుత్‌ వాహనాలకు ఇంధనం

19 Mar, 2019 00:05 IST|Sakshi

  ఫేమ్‌ పథకం  అమలుకు ప్రత్యేక కమిటీభారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటు

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌–2 పథకం అమలును పర్యవేక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా అంతర్‌–మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. నీతి ఆయోగ్‌ సీఈవో, పారిశ్రామిక ప్రోత్సాహం.. అంతర్గత వాణిజ్య వ్యవహారాల విభాగం కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శితో పాటు విద్యుత్‌.. పునరుత్పాదక ఇంధనాల శాఖ కార్యదర్శి తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏ వాహనానికి గరిష్టంగా ఎంత మేర ప్రోత్సాహకం ఇవ్వాలి, వివిధ విభాగాలకు నిధుల కేటాయింపులు ఎలా ఉండాలి తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సుమారు రూ. 10,000 కోట్లతో ప్రకటించిన ఫేమ్‌ ఇండియా రెండో విడత కార్యక్రమం ఏప్రిల్‌ 1 నుంచి మూడేళ్ల పాటు అమలవుతుంది. ఈ స్కీము కింద 2019–20లో రూ. 1,500 కోట్లు, 2020–21లో రూ. 5,000 కోట్లు, 2021–22లో 3,500 కోట్లు వ్యయం చేయనున్నారు. విద్యుత్‌ బస్సులు, ఎలక్ట్రిక్, హైబ్రీడ్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు, విద్యుత్‌ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు దీనికింద ప్రోత్సాహకం లభిస్తుంది. 

ఈ స్కీము ప్రకారం 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు దాదాపు రూ. 20,000 దాకా సబ్సిడీ లభిస్తుంది. అలాగే రూ. 5 లక్షల దాకా ధర ఉండే (ఎక్స్‌–ఫ్యాక్టరీ రేటు) 5 లక్షల ఎలక్ట్రిక్‌ రిక్షాలకు దాదాపు రూ. 50,000 దాకా ప్రోత్సాహకం ఉంటుంది. రూ. 15 లక్షల దాకా ఖరీదు చేసే 35,000 పైచిలుకు విద్యుత్‌ కార్లకు రూ. 1.5 లక్షల దాకా ప్రోత్సాహకం ఉంటుంది. రూ. 2 కోట్ల దాకా ఖరీదు చేసే 7,090 ఎలక్ట్రిక్‌ బస్సులకు రూ. 50 లక్షల దాకా ప్రోత్సాహకం లభిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 2,700 చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ఈ పథకం కింద తోడ్పాటు లభించనుంది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీలో 11 శాతం వాటా విక్రయం

కాఫీ డే కింగ్‌ అరుదైన ఫోటో

సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే

లాభాల ముగింపు

కాఫీ డే తాత్కాలిక చైర్మన్‌ నియామకం

కాఫీ కింగ్‌ విషాదాంతం వెనుక..

లాభాల బాట : 11130 వద్ద నిఫ్టీ

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కన్నుమూత

‘కాఫీ డేలో ఎన్నెన్నో ప్రేమకథలు, మరెన్నో ఙ్ఞాప​కాలు’

బాడీగార్డ్‌ యాప్స్‌

జొమాటో రిప్లైకి నెటిజన్ల ఫిదా

సిద్ధార్థతో పోల్చుకున్న మాల్యా..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

వ్యాపారవేత్తగా విఫలమయ్యా... 

కాఫీ కింగ్‌ అదృశ్యం

యాక్సిస్‌ బ్యాంకు లాభాలు రెట్టింపు

సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్‌

వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు?

చివరికి నష్టాలే, 5 నెలల కనిష్టానికి నిఫ్టీ

కాఫీ మొఘల్‌కు ఏమైం‍ది? షేర్లు డీలా

 ఆగని నష్టాలు, 11100 కిందికి నిఫ్టీ

వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ వస్తోంది..

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

పోర్ష్‌ మకన్‌ కొత్త వేరియంట్‌

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌

కంపెనీల వేటలో డాక్టర్‌ రెడ్డీస్‌

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!