పెట్రో షాక్‌ : ఆల్‌ టైం హైకి చేరిన ఇంధన ధరలు

21 Sep, 2018 10:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం పెట్రోల్‌ ధర ఆల్‌టైం హై స్ధాయిలో లీటర్‌కు రూ 89.69కు చేరగా, డీజిల్‌ ధర లీటర్‌ రూ 78.42కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ 82.32కు చేరగా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ 73.87​కు ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో ఇంధన ధరలు భారమై పెట్రోల్‌ లీటర్‌కు రూ 87.30కి చేరాయి.

పెట్రో ధరలు లీటర్‌కు రూ వందకు చేరువగా పరుగులు తీస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రో భారాలతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పారు.

పెట్రో భారాల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం తన వంతుగా కొద్దినెలల కిందటే పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు