పెట్రోల్‌, డీజిల్‌ ధరలు : ఏ నగరంలో ఎంత?

15 Oct, 2018 09:27 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు చేపట్టినా.. ఇవి పైకి ఎగుస్తూనే ఉన్నాయి. సోమవారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కో లీటరుకు 6 పైసలు, 19 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.72గా ఉంది. డీజిల్‌ ధర రూ.75.38గా నమోదైంది. అదేవిధంగా ముంబైలో డీజిల్‌ ధర నిన్నటి కంటే 20 పైసలు పెరిగి, లీటరుకు రూ.79.02గా రికార్డైంది. పెట్రోల్‌ కూడా 6 పైసలు పెరిగి రూ.88.18గా ఉంది.

చెన్నైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.85.99కు, కోల్‌కతాలో రూ.84.54కు పెరగగా.. లీటరు డీజిల్‌ ధర చెన్నైలో 19 పైసలు పెరిగి రూ.79.71గా, కోల్‌కతాలో రూ.77.23గా రికార్డయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించినప్పటికీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మాత్రం ఏ మాత్రం తగ్గింపు లేకుండా.. పెరుగుతూ ఉండే సరికి ఏకంగా ఈసారి ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు. అన్ని ఆయిల్‌ కంపెనీల సీఈవోలతో నేడు నరేంద్ర మోదీ సమావేశం కాబోతున్నారు. చమురు సరఫరాల్లో అతి ముఖ్యమైన దేశం అయిన ఇరాన్‌పై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుండటంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  

మరిన్ని వార్తలు