షాకింగ్‌ : మెట్రో నగరాల్లో పెట్రో సెగలు

24 Sep, 2018 10:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముడిచమురు ధరల భారంతో పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ 90.08కి పెరగ్గా, డీజిల్‌ లీటర్‌కు రూ 78.58కి చేరింది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ 82.72కు పెరగ్గా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ 74.02కు ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ రూ 87.58కి పెరిగింది.

ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 77 డాలర్లకు పెరగడంతో పాటు పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారంతో పెట్రో ధరలు పరుగులు పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్ధాయిలకు చేరడంతో ప్రభుత్వం ఇంధన భారాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. పెట్రో ఉత్పత్తులపై పన్నులను భారీగా తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు