కమోడిటీస్‌ డెరివేటివ్స్‌లోకి ఫండ్స్‌?

8 Dec, 2017 00:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లలో పెట్టుబడులను మరింతగా పెంచే దిశగా మ్యూచువల్‌ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌ని (పీఎం) కూడా ఇన్వెస్ట్‌మెంట్‌కి అనుమతించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భావిస్తోంది. ఈ మేరకు చర్చాపత్రాన్ని రూపొందించిన సెబీ సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు కోరింది. ఈ నెలాఖర్లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, కమోడిటీ డెరివేటివ్స్‌లో ఫండ్స్‌ పెట్టుబడులపై నియంత్రణపరమైన అంశాలను చర్చాపత్రంలో ప్రస్తావించినప్పటికీ.. వ్యవసాయ, వ్యవసాయేతర కమోడిటీల్లో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అనుమతిస్తారా లేదా అన్న దానిపై స్పష్టతనివ్వలేదు.

ఇన్వెస్ట్‌మెంట్‌కి మరో కొత్త సాధనంలాగా కమోడిటీ డెరివేటివ్స్‌ ఉపయోగపడుతుందని, పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు తోడ్పడుతుందని సెబీ పేర్కొంది. ‘కమోడిటీలను పోర్ట్‌ఫోలియోలో చేర్చడం వల్ల కొంత రిస్కు పెరుగుతుంది. కానీ రిస్కులతో పోలిస్తే మొత్తం పోర్ట్‌ఫోలియో మీద వచ్చే రాబడులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది.

>
మరిన్ని వార్తలు