వారెవ్వా.. వాల్స్!

9 Sep, 2016 23:30 IST|Sakshi
వారెవ్వా.. వాల్స్!

గోడల్లోనే వస్తువుల అమరిక

 సాక్షి, హైదరాబాద్ : ‘ఇల్లు కట్టి చూడు’ అనేది పాత నానుడి. ‘ఉన్న స్థలంలోనే వస్తువులను అమర్చి చూడు’ అన్నది లేటెస్ట్ సామెత. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో విశాలమైన ఇల్లు కావాలంటే బోలెడంత డబ్బు కావాలి. ఇది అందరికీ కుదరదు. అందుకే ఉన్న కొంచెం స్థలంలోనే ఇంట్లోని ఫర్నీచర్‌ను అమర్చుకోవాలి. దీనికి కావాల్సిందల్లా కొద్దిపాటి సృజనాత్మకతే.

సౌకర్యాల ఆలోచనలు..
ఈ రోజుల్లో 600 చ.అ.- 700 చ.అ. విస్తీర్ణంలోనే ఒక హాలు, వంట గది, పడక గది, పూజ గది, వీటిని ఆనుకునే మరుగుదొడ్డినీ నిర్మిస్తున్నారు బిల్డర్లు. హాల్‌లోనే సోఫాసెట్, టీవీ, డైనింగ్ టేబుల్, దివాన్‌కాట్ అమర్చాలి. వంట గదిలోనే ఉడెన్ కప్ బోర్డు, స్టీల్ బాస్కెట్స్, చిమ్నీ, స్టోరేజీ క్యాబిన్‌తో నిత్యావసర సరుకులతో పాటు బియ్యం వంటి వంట సామాగ్రి ఉండేలా చూసుకోవాలి. పడకగదిలో రెండు మంచాలతో పాటు గోడలకే అమర్చే కప్ బోర్డ్‌లోనే దుస్తులు, నగదు, బంగారం తదితర విలువైన వస్తువులు పెట్టే ఏర్పాటు చేసుకోవాలి.

 అన్ని గోడల్లోనే..
టీవీ మొదలుకొని బీరువా, మైక్రోఓవెన్‌ను అంతర్గత అలంకరణలో భాగంగా గోడల్లోనే అమర్చుకునేలా ప్రణాళికలున్నాయి. మరోవైపు సోపానే మంచంగా మలుచుకునేలా రెడిమేడ్‌గా తయారైనవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా హాలులో కానీ, పడక గదిలోనే ఒక గూటికి అమర్చుకునేలా నిపుణులు తయారుచే స్తున్నారు. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. ప్రత్యేకించి అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో ఇల్లు నిర్మించుకునే వారికి అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు.

మరిన్ని వార్తలు