మొబైల్ స్టార్టప్స్‌లదే భవిష్యత్తు!

28 Aug, 2015 00:47 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద కంపెనీలే కాదు ఎం-కామర్స్ (మొబైల్) ఆధారంగా సేవలందించే స్టార్టప్ కంపెనీలకు భవిష్యత్తు ఉంటుందని జీఎస్‌ఎఫ్ యాక్సలేటర్ వ్యవస్థాపకుడు రాజేష్ చెప్పారు. ఐకెవా, జీఎస్‌ఎఫ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారమిక్కడ ఎనిమిది మొబైల్ స్టార్టప్స్ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. రోజురోజుకూ స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగటం, వీటి ధరలూ తక్కువగా ఉండటం, ఎక్కడైనా..  ఎప్పుడైనా యాప్స్‌ను వినియోగించుకునే వీలుండటం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చన్నారు. విద్యా, వైద్య రంగం, పర్యాటకం, గేమింగ్ వంటి అన్ని రంగాల్లోనూ మొబైల్ స్టార్టప్స్ సేవలందిస్తున్నాయని.. ఇది సాంకేతికాభివృద్ధికి చిహ్నమని పేర్కొన్నారు. అనంతరం జాల్జ్, న్యూస్‌బైట్స్, గేమ్‌జోప్, టాక్‌మోర్, మ్యాజిక్‌టాప్, పేసెల్ఫీ, రెంట్ ఆన్ గో, టౌనిస్టా వంటి 8 మొబైల్ స్టార్టప్స్ సీడ్ రౌండ్‌లో నిధుల సమీకరణలో పాల్గొన్నాయి.

మరిన్ని వార్తలు