ఫ్యూచర్ రిటైల్ లాభం రూ.73 కోట్లు

12 Dec, 2016 14:47 IST|Sakshi
రూ.4,130 కోట్ల నికర అమ్మకాలు   
 ముంబై: ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫ్యూచర్ రిటైల్ సంస్థ స్టాండ్ అలోన్ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.73 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో తమ కంపెనీకి రూ.57 కోట్ల నష్టాలు వచ్చాయని ప్యూచర్ రిటైల్  తెలిపింది. గత క్యూ2లో రూ.360 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.4,130 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.4,071 కోట్లుగా ఉన్నాయని వివరించింది. విలీన స్కీమ్ కారణంగా ఈ క్యూ2 ఫలితాలను, గత క్యూ2 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి రూ.144 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించామని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.769 కోట్ల నుంచి రూ.8,021 కోట్లకు పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో  ఫ్యూచర్  రిటైల్ షేర్ 2 శాతం లాభపడి రూ.124 వద్ద ముగిసింది. 
మరిన్ని వార్తలు