జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతానికి సవరింపు

31 Jan, 2018 19:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిరేటును  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 7.1 శాతంగా అంచనా వేసింది. కేంద్ర గణాంక కార్యాలయం (సిఎస్ఓ) గణాంకాల ప్రకారం  2015-16లో 8.2 శాతం నుంచి జిడిపి వృద్ధి రేటు 2016-17 లో 7.1 శాతానికి పడిపోయింది. అయితే గత అంచనా 6.6శాతం నుంచి 7.1శాతానికి పెరగనుందని తెలిపింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థపై పెద్దనోట్ల రద్దు ప్రభావం  ఊహించిన దానికంటే తక్కువగానే ఉందని ప్రకటించింది.
 
ఈ  ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ ఆదాయంపై సవరించిన అంచనాలను బుధవారం విడుదల చేసింది. 2015-16 లో వాస్తవమైన జీవీఏ వృద్ధికి వరకు 8.1 శాతంతో పోలిస్తే సబ్సిడీలను మినహాయించిన తరువాత స్థూల విలువతో కలిపి (జీవీఏ) పరంగా, సవరించిన అంచనాలు 2016-17 నాటికి 7.1 శాతంకంటే  తక్కువ వృ‍ద్ధిని ఎస్టిమేట్‌ చేసింది. యూనియన్  బడ్జెట్‌ సందర్భంగా    ఈ అంచనాలను విడుదల చేయగా..   2015-16 సంవత్సరానికి వృద్ధిరేటు అంచనా వేసినవృద్ధి రేటు 8.2 శాతం.

కాగా  గత ఏడాది   మే నెలలో ప్రభుత్వం  తాత్కాలిక డేటాను విడుదల చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 8.1 శాతంగా నమోదయింది. ఫిబ్రవరి  నాటికి జిడిపి వృద్ధి అంచనా 7.1 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు