లెనొవొ నుంచి అధునాతన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌

28 Aug, 2019 08:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ) తయారీ కంపెనీ ‘లెనొవొ’.. తాజాగా తన అధునాతన గేమింగ్‌ ల్యాప్‌టాప్, పీసీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘లెజియన్‌ వై 540’ పేరుతో ల్యాప్‌ట్యాప్‌.. ‘లెజియన్‌ వై 740’ పేరిట డెస్క్‌టాప్‌లను మంగళవారం విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 70,000 నుంచి రూ. 1.3 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శైలేంద్ర కటియల్‌ మాట్లాడుతూ.. ‘గతేడాది మొదటి త్రైమాసికంలో లెజియన్‌ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. దీనికి 14.6% మార్కెట్‌ వాటా లభించింది. నూతన మోడళ్లతో ఈ ఏడాది మూడవ క్వార్టర్‌లో 20% మార్కెట్‌ వాటాకు ఎగబాకుతుందని భావిస్తున్నాం. ఇక రెండేళ్ల కిందట  శాతంగా ఉన్న గేమింగ్‌ మార్కెట్‌.. ఇప్పుడు 5 శాతానికి పెరిగింది. రూ. 60,000– రూ. 80,000 మధ్య శ్రేణి గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ల మార్కెట్‌ భారత్‌లో శరవేగంగా వృద్ధిచెందుతోంది’ అని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు