2025 నాటికి రెట్టింపు కానున్న జీడీపీ

2 Jul, 2018 00:47 IST|Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

న్యూఢిల్లీ: దేశ జీడీపీ 2025 నాటికి రెట్టింపై 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.340 లక్షల కోట్లు) స్థాయికి చేరనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. చార్టర్డ్‌ అకౌంటెంట్ల అసోసియేషన్‌ ఐసీఏఐ ప్లాటినం జూబ్లీ వేడుకలను రాష్ట్రపతి ప్రారంభించి మాట్లాడారు.  ప్రజల విశ్వాసానికి చార్టర్డ్‌ అకౌంటెంట్లు సంరక్షకులుగా పేర్కొన్నారు.

పన్ను చెల్లింపుదారులకు సాయం చేయడమే కాకుండా, కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. కేవలం ప్రభుత్వానికి ఆదాయం అందించడం కంటే పారదర్శకమైన పన్ను చట్టానికి కట్టుబడి ఉండడం కీలకమన్నారు. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి మాట్లాడుతూ.. నల్లధనానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాడుతోందని, 2.25 లక్షల అనుమానిత కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు